Garla: గార్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బేటీ బచావో సదస్సు

Garla: గార్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బేటీ బచావో బేటీ పఢావో అవగాహన సదస్సు నిర్వహించి, బాలికలకు న్యూట్రిషన్ కిట్లను అధికారులు అందజేశారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 27 Oct 2026 6:28 PM IST
Garla
X

Garla: గార్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బేటీ బచావో సదస్సు

​మహబూబాబాద్ జిల్లా: గార్ల మండలం మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పఢావో’ కార్యక్రమంలో భాగంగా గార్ల మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ​

ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ రాజకుమారి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారి శిరీష మరియు డోర్నకల్ CDPO లక్ష్మి పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా శిరీష ,లక్ష్మి మాట్లాడుతూ, బాలికల రక్షణ, విద్య, సాధికారత, సమాన అవకాశాల కల్పనలో బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. అలాగే బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో చట్టం, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

​బాలికలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ, పోషకాహారం తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. బాలికల విద్యకు ప్రాధాన్యతనిస్తూ, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని తెలిపారు.

​బేటీ బచావో బేటీ పఢావో' కార్యక్రమంలో భాగంగా బాలికలకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు.

​ఈ కార్యక్రమంలో DHEW కో-ఆర్డినేటర్ మహేశ్వరి, అరుణ, సంధ్యా రాణి, కళాశాల అధ్యాపక బృందం , విద్యార్థులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM