Palakurthi: ఆర్థిక భారాన్ని తగ్గించడమే సంస్థ లక్ష్యం: సీఎండీ తెప్పలి సైదులు!

Palakurthi: పాలకుర్తిలో బ్యూలా ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమావేశం. ఆర్థిక స్వావలంబనకు సంస్థ కృషి చేస్తుందన్న సీఎం‍డీ తెప్పలి సైదులు. ఆరు రకాల నిత్యావసరాల పంపిణీ వివరాలు వెల్లడి.

S MAHENDER, PALAKURTHI
Published on: 17 Sept 2026 5:35 PM IST
Palakurthi
X

Palakurthi: ఆర్థిక భారాన్ని తగ్గించడమే సంస్థ లక్ష్యం: సీఎండీ తెప్పలి సైదులు!

పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని మాంగల్య గార్డెన్ లో గురువారం నిర్వహించిన సమావేశానికి వారు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు... బ్యూలా ట్రేడర్స్ ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా ప్రజలకు ఆరు రకాల వస్తువులను అందిస్తున్నామని తెలిపారు. హెర్బల్, కిరాణం, దుస్తులు, హోం నీడ్స్, సిల్వర్, బంగారం అందిస్తున్నామన్నారు.

ఆరు రకాల వస్తువుల్లో ప్రతి వస్తువు ప్రతి కుటుంబంలో అవసరం ఉంటుందని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వస్తువు తయారు చేసే కంపెనీ ప్రధాన డీలర్ నుంచి బ్యులా ట్రేడర్స్ ప్రయివేట్ లిమిటెడ్ వస్తువులను కొనుగోలు చేసి లబ్దిదారులకు అందిస్తున్నామన్నారు. 12 నెలల్లో 6 వేలు రివార్డు అందుతుందని వస్తువు కొనుగోలు విలువ వెయ్యి రూపాయలు మాత్రమే ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కస్టమర్లు, ఏజెంట్లు సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI