Jangaon: జనగామలో భగీరథ మహర్షి జయంతి ఘనంగా నిర్వహణ
Jangaon: జనగామ కలెక్టరేట్‌లో భగీరథ మహర్షి జయంతి ఘనంగా జరిగింది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నివాళులర్పించారు.
Jangaon
Jangaon: జనగామ కలెక్టరేట్‌లో గురువారం మహర్షి భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా హాజరై మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగీరథుడు పట్టుదల, నిరంతర కృషికి ప్రతీకగా నిలిచారని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. లక్ష్యం సాధనలో అంకితభావం ఎంత ముఖ్యమో భగీరథుని జీవితం ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి నరసింహరావు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




