Bhupalpally: భూపాలపల్లిలో సకల కళాకారుల ఉత్సవాలు అంబరాన్నంటిన సంబరాలు!
Bhupalpally: జయశంకర్ భూపాలపల్లిలో సకల కళాకారుల ఉత్సవాలు. కళాకారులతో ర్యాలీలో పాల్గొని ఐడీ కార్డులు అందజేసిన ఎమ్మెల్యే గండ్ర.
Bhupalpally: భూపాలపల్లిలో సకల కళాకారుల ఉత్సవాలు అంబరాన్నంటిన సంబరాలు!
Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కళాకారుల సందడి నెలకొంది. అంబేద్కర్ సెంటర్‌లో యక్షగాన కళాకారులు, కోలాట బృందాలు, డప్పు కళాకారులు ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. వారి ప్రదర్శనలు స్థానికులను విశేషంగా అలరించాయి.
అనంతరం అంబేద్కర్ సెంటర్ నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు యక్షగాన కళాకారులు, కోలాట బృందాలు, డప్పు వాయిద్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కళాకారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు..
తర్వాత అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో కళాకారులకు గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జానపద కళలు, కళాకారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కళాకారుల ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు వారికి అవసరమైన గుర్తింపు, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కళలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, కళాకారుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.




