Bhupalpally: బీఆర్‌ఎస్ సమరభేరి 420 ఫీట్ల ఫ్లెక్సీతో భారీ నిరసన ర్యాలీ!

Bhupalpally: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై జయశంకర్ భూపాలపల్లిలో బీఆర్‌ఎస్ భారీ నిరసన. 420 ఫీట్ల ఫ్లెక్సీ ప్రదర్శన, అంబేద్కర్ సెంటర్ వద్ద మానవహారం.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 2 Sept 2026 3:38 PM IST
Bhupalpally
X

Bhupalpally: బీఆర్‌ఎస్ సమరభేరి 420 ఫీట్ల ఫ్లెక్సీతో భారీ నిరసన ర్యాలీ!

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజు ఈ ర్యాలీ నిర్వహించారు.

భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లను అమలు చేయడంలో విఫలమైందంటూ పెద్ద ఎత్తున 420 ఫీట్ల బ్యానర్ తో ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

ర్యాలీ అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ భూపాలపల్లి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు, మహిళా విభాగం, యువజన విభాగం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసన కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally

Next Story