Bhupalpally: భూపాలపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి సీపీఐ ధర్నా
Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా. ఎల్‌నినో కరువుతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్.
Bhupalpally: భూపాలపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి సీపీఐ ధర్నా
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు జయశంకర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చేపట్టిన ఈ నిరసనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించాయని ఆరోపించారు. ఈ క్రమంలో సీపీఐ నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్‌కు ర్యాలీగా చేరుకున్నారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కరువు పరిస్థితుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. వ్యవసాయంపై ఆధారపడిన రైతుల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వరి పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ఎకరానికి 30 వేల రూపాయల చొప్పున పరిహారం అందించాలని, వాణిజ్య పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు ఎకరానికి 50 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సూచనలను నమ్మి వరి సాగు చేయకుండా ఇతర పంటలు వేసిన రైతులకు కూడా నష్టపరిహారం అందించాలని కోరారు.




