Kataram: కాటారంలో భక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు

Kataram: కాటారం మండలం ఆదర్శ నగర్‌లో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు. మూడో రోజు ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Sept 2026 6:02 PM IST
Kataram
X

Kataram: కాటారంలో భక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. మండల కేంద్రంలోని ఆదర్శ నగర్ లోని ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు నేటితో మూడవ రోజుకు చేరుకున్నాయి.

వినాయక మండపం వద్ద భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఘనంగా ఏకం భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. భజన పాటలతో కాలనీలో అధ్యత్మాక వాతావరణం నెలకొంది..

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్