Bhupalpally: బాధితుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసి అందజేసిన ఎమ్మెల్యే!
Bhupalpally: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రూ.2.50 లక్షల ఎల్‌ఓసి సహాయం అందజేశారు. బుద్ధారం గ్రామానికి చెందిన రమేష్ చికిత్స నిమిత్తం సాయం.
Bhupalpally: బాధితుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసి అందజేసిన ఎమ్మెల్యే!
Bhupalpally: భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన అల్లపు రమేష్‌కు అనారోగ్య చికిత్స కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రూ.2.50 లక్షల ఎల్.ఓ.సి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఆరోగ్యశ్రీలో కవర్ కాని వ్యాధుల చికిత్సకు ప్రభుత్వం ఎల్.ఓ.సి ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, గణపురం పీఏసీఎస్ చైర్మన్ కన్నబోయిన కుమార్ యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Next Story




