Bhupalpally: వైఎస్సార్‌ 17వ వర్ధంతి.. ఘన నివాళులర్పించిన కాంగ్రెస్!

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 3 Sept 2026 10:51 AM IST
Bhupalpally
X

Bhupalpally: వైఎస్సార్‌ 17వ వర్ధంతి.. ఘన నివాళులర్పించిన కాంగ్రెస్!

Bhupalpally: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భట్టు కర్ణాకర్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్ణాకర్ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమాన్ని ప్రతి పల్లెకు, ప్రతి గడపకు చేర్చిన ఘనత వైఎస్సార్‌దేనని అన్నారు. రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన గొప్ప నాయకుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు.

వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన, ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన మహానేతను ఎప్పటికీ మరువలేమని అన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally

Next Story