Garla: గార్లలో రైతు సంఘం జాతీయ మహాసభల జయప్రదానికి బైక్ ర్యాలీ!
Garla: నవంబర్ 15న నల్గొండలో జరిగే అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ గార్ల మండలంలో రైతు సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
Garla: గార్లలో రైతు సంఘం జాతీయ మహాసభల జయప్రదానికి బైక్ ర్యాలీ!
మహబూబాబాద్ జిల్లా: గార్ల మండల కేంద్రంలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ 36వ మహాసభల సందర్భంగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 15న నల్గొండలో జరిగే భారీ ప్రదర్శన, బహిరంగ సభ జయప్రదం చేయాలని రైతు సంఘం మండల కార్యదర్శి గడ్డిపాటి రాజారావు, మండల అధ్యక్షులు కందునూరి శ్రీనివాస్ లు పిలుపునిచ్చారు.
సందర్భంగా మాట్లాడుతూ...రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సిపిఎం కార్యాలయం నుండి పట్టణ పూర వీధుల తో పాటు , దుబ్బగూడెం, ముల్కనూరు, గుంపెల్ల గూడెం, నరసింహులపేట,ఇందిరా నగర్, సత్యనారాయణపురం, మంగళతండా, సీతంపేట మీదుగా గార్ల వరకు శుక్రవారం ద్విచక్ర వాహనాల నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని సంఘం నాయకులు విమర్శించారు. స్వామినాథన్ కమిషన్ ప్రకారం పంటలకు లాభసాటి ధర ఇస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని, రైతుల రుణ మాఫీ చేయాలని, రైతు ఉద్యమంలో మరణించిన 700 మంది రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.




