Hanamkonda: హన్మకొండలో హెచ్‌ఐవీ, టీబీ అవగాహన బైక్ ర్యాలీ!

Hanamkonda: హన్మకొండలో హెచ్‌ఐవీ, టీబీ అవగాహన బైక్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్.. 'సురక్షిత్ జిల్లా'ే లక్ష్యమంటూ పిలుపు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 18 Sept 2026 1:22 PM IST
Hanamkonda
X

Hanamkonda: హన్మకొండలో హెచ్‌ఐవీ, టీబీ అవగాహన బైక్ ర్యాలీ!

Hanamkonda: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నిర్మూలనకు విస్తృత అవగాహన కల్పించడంతోపాటు ముందస్తు పరీక్షలు, సకాలంలో చికిత్స అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.

హెచ్ఐవి,టీబి,STI,రక్తదాన అవగాహన బైక్ ర్యాలీని శుక్రవారం ఐ డి ఓ సి హనుమకొండ నుంచి నిట్ హనుమకొండ వరకు జరిగే బైక్ ర్యాలీని కలెక్టర్ చాహత్ బాజ్ పాయి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ ర్యాలీ ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ... HIV/AIDS, STIsపై యువతలో అవగాహన పెంపొందించాలని...జిల్లా ని "సురక్షిత్ జిల్లా " గా రూపొందించేందుకు అందరు కృషి చేయాలని పేర్కొన్నారు.

హెచ్ఐవి, ఎయిడ్స్, ఎస్ టి ఐ, టీబి, రక్తదాన శిబిరాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని టీబి& హెచ్ఐవి ఉన్నవారిని త్వరగా గుర్తించి న్యూట్రిషన్ కిట్స్ అందజేయాలని కోరారు.

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ అప్పయ్య మాట్లాడుతూ.... ప్రతి గర్భిణీ స్త్రీ మొదటి, రెండవ,మూడవ త్రైమాసికం లొ తప్పనిసరిగా హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాలని, హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం 1097 కు కాల్ చేయవచ్చని తెలియజేశారు.

హెచ్ఐవి సోకిన వ్యక్తులకు టీబి వచ్చే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ రెండు వారాలకు మించి దగ్గు,జ్వరము దగ్గినప్పుడు రక్తం పడడం,అలసట, బరువు తగ్గడం, నీరసం,అన్నం తినాలనిపించకపోవడం లాంటి లక్షణాలు అవుపించినట్టయితే తప్పనిసరిగా టీబి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలియజేశారు.

ఈకార్యక్రమంలో జిల్లా అడిషనల్ డాక్టర్ టి.మదన్ మోహన్ రావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మాధవరెడ్డి నెహ్రూ నాయక్ HEEO సందెల శ్రీనివాస్, DPMO లు రవీందర్,దేవి సింగ్,సువార్త గ, సబ్ యూనిట్ ఆఫీసర్ విప్లవ కుమార్, జిల్లాలోని అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలసూపర్వైజర్లు, సిస్టర్లు హెల్త్ అసిస్టెంట్లు , సిబ్బంది, DPM (DAPCU) మాధురి, సిబ్బంది కమలాకర్, రామకృష్ణ NGO లు మారి వరంగల్, మారి భూపాలపల్లి S. Y. O, RDMM, వర్డ్, MIPRE , NPS స్వచ్ఛంద సంస్థల ఉద్యోగులు, టీవీ హాస్పిటల్ కౌన్సిలర్ రాపర్తి సురేష్, కళాజాత బృందం పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.