Warangal: వరంగల్‌లో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు!

Warangal: వరంగల్ తూర్పు నియోజకవర్గం కొత్తవాడ గోపాలస్వామి గుడి సర్కిల్ వద్ద ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. నివాళులర్పించిన బీజేపీ నేతలు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 27 Sept 2026 1:46 PM IST
Warangal
X

Warangal: వరంగల్‌లో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు!

Warangal: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కొత్తవాడ గోపాలస్వామి గుడి సర్కిల్ వద్ద ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు సూచన కాంతి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు, పద్మశ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడంతో పాటు, తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగం భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని అన్నారు.

పదవుల కంటే ప్రజాసేవకే ప్రాధాన్యతనిచ్చిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. బాపూజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్ధం నరేష్, సీనియర్ నాయకులు రత్నం సతీష్ షా, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, బిజెపి రాష్ట్ర నాయకులు త్రీ లోకేశ్వరరావు, బైరి మురళీకృష్ణ, ముండ్రాతి వెంకటేశ్వర్లు, బైరి శ్యాంసుందర్, ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిలు కర్నె రవీందర్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పేరాల భాస్కర్, కోమాకుల నాగరాజు,విక్రం,బండి సుజాత, శివప్రసాద్, జిల్లా నాయకులు గుర్రాల చంద్రమౌళి, కొంతం సంగీత్, గుర్రపు సత్యనారాయణ, గుంతిక శ్రీధర్, వల్లెల రమేష్, శోభా మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఘనంగా నివాళులర్పించారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST