Hanamkonda: హనుమకొండలో ఉద్రిక్తత.. కుడా కార్యాలయం ఎదుట బీజేపీ భారీ ఆందోళన
Hanamkonda: హనుమకొండలోని బాలసముద్రం కమర్షియల్ ప్లాట్ల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు కుడా (KUDA) కార్యాలయాన్ని ముట్టడించారు.
Hanamkonda: హనుమకొండలో ఉద్రిక్తత.. కుడా కార్యాలయం ఎదుట బీజేపీ భారీ ఆందోళన
హనుమకొండ: హనుమకొండలోని బాలసముద్రం కమర్షియల్ ప్లాట్ల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ, బిజెపి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) కార్యాలయాన్ని ముట్టడించారు.
ఈ సందర్బంగా రావు పద్మ మాట్లాడుతూ..
విలువైన ప్రభుత్వ భూములను విక్రయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆస్తులను విక్రయించే విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కుడా కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బాలసముద్రం ప్రాంతంలోని కమర్షియల్ ప్లాట్ల వేలానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు,ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములను విక్రయించడం సమంజసం కాదన్నారు.
ఈ నిరసనతో కుడా కార్యాలయం పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టి పరిస్థితిని అదుపులో ఉంచారు. బీజేపీ నాయకులు తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఆందోళన చేపడుతున్న బిజెపి నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.




