Mahabubabad: కేసముద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం దగ్ధం చేసిన బీజేపీ!
Mahabubabad: కేసముద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం దగ్ధం చేసిన బీజేపీ. హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా జ్యోతిరావు పూలే సెంటర్లో ఆందోళన.
Mahabubabad: కేసముద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం దగ్ధం చేసిన బీజేపీ!
Mahabubabad: హిందూ దేవుళ్లను అవమానిస్తూ, ఉత్తర-దక్షిణ విభేదాలను రెచ్చగొట్టేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కేసముద్రం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక జ్యోతిరావు పూలే సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దగ్ధం చేశారు.
బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పునూతుల రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు పాల్గొని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, న్యూఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి హిందూ సమాజాన్ని కించపరిచేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. "శ్రీరాముడు ధనికులకు, శివుడు పేదవాళ్లకు" అంటూ దేవుళ్ల మధ్య కూడా ఆర్థిక, ప్రాంతీయ విభజనలు తీసుకురావడాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు. ఓట్ల రాజకీయం కోసం హిందూ సమాజాన్ని విడదీసేలా మాట్లాడటం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి తగదని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ జిల్లా నాయకులు ఓలం శ్రీనివాస్, మహమ్మద్ ఖాసిం, ఎస్సీ మోర్చా అధ్యక్షులు పూర్ణఘటి భాస్కర్, జుజ్జూరు వీరభద్ర చారి, బానోత్ సంపత్, కాటం వెంకట్ రెడ్డి, నగేష్ నాయక్, బానోత్ యాకూబ్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




