Gudur: బీజేవైఎం గూడూరు మండల అధ్యక్షుడిగా బూరుగు సాయి కుమార్ గౌడ్

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల బీజేవైఎం అధ్యక్షుడిగా అయోధ్యపురం ఉప సర్పంచ్ బూరుగు సాయి కుమార్ గౌడ్ నియమితులయ్యారు.

B NARASIMHA, GUDUR
Published on: 18 Sept 2026 2:37 PM IST
Gudur
X

Gudur: బీజేవైఎం గూడూరు మండల అధ్యక్షుడిగా బూరుగు సాయి కుమార్ గౌడ్

గూడూరు: గూడూరు మండల భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) మండల అధ్యక్షుడిగా గూడూరు మండలం అయోధ్యపురం గ్రామనికి చెందిన బూరుగు సాయి కుమార్ గౌడ్ నియమితులయ్యారు.

ఈ సందర్భంగా సాయి కుమార్ గౌడ్ మాట్లాడుతూ తనను బీజేవైఎం మండల అధ్యక్షుడిగా నియమించేందుకు సహకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు, జాటోత్ హుస్సేన్ నాయక్ గారు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దిడ్డి మహేష్ గారు మరియు గూడూరు బీజేపీ మండల, జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

మండలంలోని యువతను పార్టీతో అనుసంధానం చేస్తూ, యువత సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో బీజేవైఎంను మండలంలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని సాయి కుమార్ గౌడ్ తెలిపారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR