Narsampet: మా సొమ్ము చెల్లించకుండా ముంచారు పెద్ది సుదర్శన్ రెడ్డిపై ఆరోపణ

Narsampet: 2016-17లో బోర్వెల్స్ వేయించి డబ్బులు చెల్లించలేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై శ్రీ లక్ష్మీ బోర్వెల్స్ యజమాని మోహన్ రెడ్డి ఆవేదన.

RAJESH,	WEST ZONE
Published on: 11 July 2026 5:50 PM IST
Narsampet
X

Narsampet: మా సొమ్ము చెల్లించకుండా ముంచారు పెద్ది సుదర్శన్ రెడ్డిపై ఆరోపణ

నర్సంపేట: పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా 2016-17 లో 154 వేయించి అప్పటి సివిల్ సప్లై చైర్మన్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా తమను నిండా ముంచాడని నర్సంపేటకు చెందిన శ్రీ లక్ష్మీ బోర్వెల్స్ యజమాని మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి దాదాపు పది సంవత్సరాలుగా ఒక్క రూపాయి చెల్లించకుండా తమను అప్పుల పాలు చేశాడని అన్నారు. ఇదే విషయమై కేటీఆర్ ని కలుస్తే తమ ప్రభుత్వం మళ్ళీ వచ్చాక చెల్లిస్తామని, హరీష్ రావు ని కలిస్తే మీకు బస్సు కిరాయిలకు కూడా డబ్బులు ఇవ్వము ఏం చేసుకుంటారో చేసుకోండి అని, కేసిఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళితే లోపటికి కూడా రాకుండా గెంటేస్తున్నారని అన్నారు.

సుమారు కోటి రూపాయలు అప్పుచేసి వేసిన బోర్వెల్స్ ఈరోజు తెచ్చిన వడ్డీలతో కలిపి 15 కోట్ల రూపాయల నష్టం మిగిల్చింది అని,తమ ఇల్లు పొలాలు అమ్ముకొని తమ ఉమ్మడి కుటుంబం రోడ్డు మీద పడ్డామని వాపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని తమ నష్టపోయిన డబ్బులు ఇప్పించాలని అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story