Palakurthi: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ కుటుంబాలు!
Palakurthi: పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్. బుర్హనపల్లి గ్రామానికి చెందిన పలు కుటుంబాలు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరాయి.
Palakurthi: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ కుటుంబాలు!
Palakurthi: పాలకుర్తి మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాయపర్తి మండలం,బుర్హనపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పలు కుటుంబాలు గ్రామ సర్పంచ్ సూదులు ఉమాదేవి ఆధ్వర్యంలో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి సమక్షంలో ఆమె చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నూతనంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




