Warangal: వరంగల్ పశ్చిమలో రాజకీయ వేడి: నాయిని రాజేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ ఆగ్రహం!
Warangal: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు కంజర్ల మనోజ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు.
Warangal: వరంగల్ పశ్చిమలో రాజకీయ వేడి: నాయిని రాజేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ ఆగ్రహం!
Warangal: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో బిఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు.నిన్న హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాయిని రాజేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దుగ్గంపూడి రంజిత్ రెడ్డి పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 4వ డివిజన్ అధ్యక్షుడు కంజర్ల మనోజ్ కుమార్ సోమవారం హన్మకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా మనోజ్ మాట్లాడుతూ..నాయిని రాజేందర్ రెడ్డి.. బీఆర్ఎస్ నాయకులపై అసత్య ఆరోపణలు చెయ్యడం తప్ప నియోజకవర్గ అభివృద్ధి చెయ్యడం లేదు అన్నారు.మతి బ్రమించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎందుకు నిరుపేదలకు సహాయం చేయడం లేదని ప్రశ్నించారు.
దుగ్గెంపూడి రంజిత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఇటీవలే హరీష్ రావు చేతుల మీదుగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడంపై విమర్శలు చేసిన నాయిని రాజేందర్ రెడ్డి, కనీసం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఒక్క పెన్సిల్ అయిన అందించారా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే అని మరిచి.. ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.
ఎమ్మెల్యే నాయిని, దాస్యం వినయ్భాస్కర్, దుగ్గెంపూడి రంజిత్ రెడ్డి పై అసత్య ఆరోపణలు చేయడం ఇకనైనా మానుకొవలన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. నియోజకవర్గ ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని మనోజ్ అన్నారు.




