Mulugu: కాంగ్రెస్‌ పాలనపై మల్లూరులో బీఆర్ఎస్ భారీ ర్యాలీ!

Mulugu: ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు జాతీయ రహదారిపై భారీ ర్యాలీ చేపట్టాయి.

I NARESH, ETURUNAGARAM
Published on: 3 Sept 2026 5:03 PM IST
Mulugu
X

Mulugu: కాంగ్రెస్‌ పాలనపై మల్లూరులో బీఆర్ఎస్ భారీ ర్యాలీ!

ములుగు జిల్లా: మంగపేట మండలం మల్లూరు లో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ర్యాలీ. కేటీఆర్ పిలుపుతో బి ఆర్ ఎస్ జిల్లా యువ నాయకులు బాడిశ నాగ రమేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు.

100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పిందని బీఆర్ఎస్ విమర్శ, జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపణ రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్. ఎన్నికల హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేతల డిమాండ్.

I NARESH, ETURUNAGARAM

I NARESH, ETURUNAGARAM

Next Story