Hanamkonda: కంటాత్మకూర్ వాగు మాటు వద్ద మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి!
Hanamkonda: హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంటాత్మకూర్ వాగు మాటు వద్ద మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ నేత పగడాల కాళీ ప్రసాద్ రావు.
Hanamkonda: కంటాత్మకూర్ వాగు మాటు వద్ద మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి!
Hanamkonda: నడికూడ మండలం కంటాత్మకూర్ వాగు మాటు వద్ద మైనింగ్ కు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డా. పగడాల కాళీ ప్రసాద్ రావు డిమాండ్ చేశారు.
నడికూడ మండల అధ్యక్షులు ఎరుకల దివాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యవేక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంటాత్మకూర్ వాగు మాటు ప్రాంతాన్ని, శిథిలావస్థలో ఉన్న పురాతన మడేలమ్మ, గణపతి, శివ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... కంటాత్మకూర్ వాగు మాటు ప్రజల జీవనాధారమని, గుట్ట గ్రామానికి రక్షణగా ఉందని అన్నారు. ఈ మాటు సుమారు ఐదు గ్రామాల రైతులకు జీవనాధారం, తాటి వనం గీత కార్మికులకు, ముదిరాజ్ కుటుంబాలకు ఉపాధి వనరు అని పేర్కొన్నారు. మైనింగ్ వల్ల గుట్ట, నీటి వనరులు, వ్యవసాయం, స్థానిక ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాబట్టి మైనింగ్ అనుమతులను రద్దు చేసి గుట్టను, మాటును, తాటి వనాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పున్నం వేణు, JAC చైర్మన్ రేకుల సతీష్, గునిపర్తి సర్పంచ్ కరుణాకర్, మదన్నపేట సర్పంచ్ రమేష్, శనిగరం సర్పంచ్ రాజ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శులు తిపరపు సుధీర్, దండు సురేష్, SC జిల్లా ఉపాధ్యక్షులు మేకల నరేష్, తాళ్లపెల్లి హరికృష్ణ, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు గుడికందుల శివ, మాజీ సర్పంచ్ శివకుమార్ తదితరులు, పెద్ద సంఖ్యలో రైతులు, గౌడ, ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.




