Warangal: ల్యాండ్ రీ-సర్వే పనులపై సిసిఎల్ఏ ఉన్నత స్థాయి సమీక్ష!

Warangal: నక్ష టౌన్ సర్వే, 70 గ్రామాల ఎంజాయ్‌మెంట్ సర్వే అమలుపై సిసిఎల్ఏ సెక్రటరీ లోకేష్ కుమార్, కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంత్ వీడియో కాన్ఫరెన్స్.

Narender, Staff Reporter  -Warangal
Published on: 19 Jun 2026 8:12 PM IST
Warangal
X

Warangal: ల్యాండ్ రీ-సర్వే పనులపై సిసిఎల్ఏ ఉన్నత స్థాయి సమీక్ష!

Warangal: నక్ష (NAKSHA) టౌన్ సర్వే, 70 గ్రామాల ఎంజాయ్‌మెంట్ సర్వే మరియు నాన్-కడాస్ట్రల్ సర్వే అమలుపై హైదరాబాద్ నుంచి సీసీఎల్‌ఏ సెక్రటరీ లోకేష్ కుమార్, సర్వే, సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంత్ శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లాలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో ఎంజాయ్‌మెంట్ సర్వే పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఆయా గ్రామాల్లో రీ-సర్వే చేపట్టేందుకు అవసరమైన గెజిట్ ప్రచురణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, సర్వే పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

నక్ష (NAKSHA) టౌన్ సర్వే అమలులో నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే నాన్-కడాస్ట్రల్ సర్వే పనుల అమలుపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, అదనపు కలెక్టర్ శ్రీమతి జి. సంధ్యారాణి, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీ ఎం. శ్రీనివాసులు తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story