Parkal: హన్మకొండ ఆసుపత్రిలో బీఆర్‌ఎస్ నాయకుడు నమిండ్ల శ్రీనివాస్ పరామర్శ!

Parkal: హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ నాయకుడు నమిండ్ల శ్రీనివాస్‌ను పరామర్శించిన పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.

M PRABHAKAR, PARAKAL
Published on: 28 Sept 2026 5:43 PM IST
Parkal
X

Parkal: హన్మకొండ ఆసుపత్రిలో బీఆర్‌ఎస్ నాయకుడు నమిండ్ల శ్రీనివాస్ పరామర్శ!

Parkal: రోడ్డు ప్రమాదంలో గాయపడి హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జీడబ్ల్యూఎంసీ 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు నమిండ్ల శ్రీనివాస్‌ను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రికి వెళ్లిన చల్లా ధర్మారెడ్డి శ్రీనివాస్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యులను అడిగి చికిత్స వివరాలను తెలుసుకోవడంతో పాటు, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. శ్రీనివాస్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చల్లా ధర్మారెడ్డి ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL