Hanamkonda: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యం!

Hanamkonda: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పరకాలలో బీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశం. అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని మాజీ ఎమ్మెల్యే పిలుపు.

M PRABHAKAR, PARAKAL
Published on: 5 Oct 2026 12:45 PM IST
Hanamkonda
X

Hanamkonda: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యం!

Hanamkonda: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేయాలని సూచించారు.

సోమవారం పరకాల పట్టణంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ముందుగా అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడి ఓటరు నమోదు పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.

ప్రతి వార్డులోని పట్టభద్రులను గుర్తించి, వారిని సంప్రదించి ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించి పట్టభద్రులకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమోదు చేసుకునేలా చూడాలన్నారు.

గతంలో పట్టభద్రుల ఓటరుగా నమోదైన వారు సైతం తాజా ఓటరు జాబితా కోసం మళ్లీ నమోదు చేసుకోవాల్సి ఉన్నందున ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని చల్లా ధర్మారెడ్డి సూచించారు. వార్డుల వారీగా నాయకులు బాధ్యతలు తీసుకుని నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులంతా ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని, ప్రతి పట్టభద్రుడిని కలిసి ఓటరు నమోదుతో పాటు ఎన్నికల ప్రాధాన్యతను వివరించాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేస్తూ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని చల్లా ధర్మారెడ్డి అన్నారు.

వార్డుల వారీగా ఇంచార్జీల ఏర్పాటు:

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్య పరకాల పట్టణంలో 22 వార్డులకు గాను ఇంచార్జీలను మాజీ ఎమ్మెల్యే నియమించారు.

వార్డుల వారీగా ఇంచార్జిలు:

1,2,13 - దుబాసి వెంకటస్వామి

3,12,14,22 కొక్కిరాల రాకేష్ రావు

4,5,16 బండి సారంగపాణి

5,20,21 శనిగరం నవీన్

6,7,8 దుంపేటి నాగరాజు

9,10,11 చందుపట్ల తిరుపతి రెడ్డి

17,18,19 రేగురి విజయపాల్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, యూత్ నాయకులు,క్లస్టర్ ఇన్‌చార్జీలు,వార్డు ఇంఛార్జీలు తదితరులు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL