Bayyaram: బయ్యారంలో చలో కలెక్టరేట్ మహాధర్నా కరపత్రాలు విడుదల

Bayyaram: జీవో 3 రక్షణ, ఉద్యోగ అవకాశాల కోసం అక్టోబర్ 5న నిర్వహించనున్న భద్రాద్రి కలెక్టరేట్ మహాధర్నా కరపత్రాలను బయ్యారంలో ఆవిష్కరించారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 20 Sept 2026 6:17 PM IST
Bayyaram
X

Bayyaram: బయ్యారంలో చలో కలెక్టరేట్ మహాధర్నా కరపత్రాలు విడుదల

మహబూబాబాద్ జిల్లా: బయ్యారం మండల కేంద్రంలో జిల్లా ఉపాధ్యక్షుడు మంకిడి సురేష్ ఆధ్వర్యంలో చలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ మహాధర్నా, కలెక్టరేట్ ముట్టడి అక్టోబర్ 5న కరపత్రాలు ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దనసరి రాజేష్ పాల్గొని సందర్భంగా మాట్లాడుతూ... ఏజెన్సీ ప్రాంతంలోని ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కలగాలంటే g o ms no 3 తో పాటు 29 జీవుల్ని కలిపి ప్రత్యేక చట్టం చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 5న జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం నందు మహా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వారు తెలిపినారు.

ఈ యొక్క పోరాటం ఆదివాసీల హక్కుల కోసం, ఆదివాసీల మనగడ కోసం చేసే పోరాటం ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీల జీవన మరణ పోరాటంగా తెలియజేశారు.

ఆదివాసి సంఘాల కోసం చేసే పోరాటం

ప్రతి ఆదివాసి కుటుంబం కోసం చేసే పోరాటం ఇది ఆదివాసి మహిళల కోసం చేసే పోరాటం ఇది ఆదివాసి యువత కోసం చేసే పోరాటం ఇది ఆదివాసీల ఉద్యోగ రిజర్వేషన్ కోసం చేసే పోరాటం ఈ మహా ధర్నా కార్యక్రమానికి వచ్చేసి ఉద్యమించి మన హక్కులు సాధించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తాటి సుధాకర్ ,పునేం జనార్దన్ జిల్లా కార్యదర్శి, దారం సాంబరాజు జిల్లా జాయింట్ సెక్రటరీ,దనసరి రమేష్ గంగారం మండల అధ్యక్షులు, బచ్చల వెంకటేష్ బయ్యారం మండల కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM