Mahabubabad: గూడూరు సర్కారు దవాఖానాలో వైద్యుల నిర్లక్ష్యం బాధితుల ఆవేదన

Mahabubabad: గూడూరు సిహెచ్‌సి ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు మధ్యాహ్నం వేళ సీట్లలో కాలక్షేపం చేస్తుండటంపై రోగులు ఆగ్రహం.

B NARASIMHA, GUDUR
Published on: 7 Aug 2026 2:38 PM IST
Mahabubabad
X

Mahabubabad: గూడూరు సర్కారు దవాఖానాలో వైద్యుల నిర్లక్ష్యం బాధితుల ఆవేదన

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యాధికారి కార్యాలయంలో (CHC) ఉద్యోగుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమయ పాలన పాటించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, ప్రజలకు సేవలు అందించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు.

​గూడూరు మండలం అయోధ్య పురం (CHC) ప్రభుత్వ వైద్య కార్యాలయంలో మధ్యాహ్నం వేళల్లో సైతం ఉద్యోగులు విధులను గాలికొదిలేశారు. ఉదయం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజలు నిర్వహించవలసిన డాక్టర్ లు మధ్యాహ్నం సమయంలోనే విధులను గాలికి వదిలేసి ఇంటికి చేరుకుంటున్నారు.

ఓ ఉద్యోగి సగం పనిలోనే మొబైల్ ఫోన్ చూస్తూ కాలక్షేపం చేస్తుండగా, మరొక ఉద్యోగిని ఏకంగా కార్యాలయ సీట్లోనే గాఢ నిద్రలో మునిగిపోయారు. గంటల తరబడి బాధితులు, రోగులు ఆసుపత్రికి వచ్చి నిరీక్షిస్తున్నా, పట్టించుకునే నాథుడే కరువయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.​"వైద్య సేవల కోసం వచ్చే పేద రోగులకు సిబ్బంది నిర్లక్ష్యం శాపంగా మారింది. అత్యవసర సమయంలో కూడా సమయపాలన పాటించకపోవడం గమనార్హం."

ఉదయం తప్ప మీగత సమయం లో కనిపించని ఆశ వర్కర్లు గ్రామాలలో విధులు నిర్వహించవలసిన ఆశ వర్కర్లు ఉదయం తప్ప మిగతా సమయంలో ఎక్కడ చూసినా కనిపించడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. మీటింగ్ ల పేర్లతో క్యాంపుల సాకుతో విధులను గాలికి వదిలేసి తమ సొంత పనులు చేసుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాలలో పరిశుభ్రతపై అవగాహన కలిగిస్తూ గ్రామంలో ఉన్న వృద్ధులు రోగులకు మాత్రలు అందించి వైద్యం చేయాల్సిన ఆశ వర్కర్లు తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు ‌

​స్థానికుల డిమాండ్..

​సేవలు అందించాల్సిన సమయంలో మొబైల్స్‌తో కాలక్షేపం, నిద్రపోతున్న సిబ్బందిపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.​కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరు మరియు సమయపాలనను కఠినంగా అమలు చేయాలి.జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి గూడూరు వైద్య కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story