Wardhannapet: చెన్నారం దళితులకు వెంటనే ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలి!
Wardhannapet: చెన్నారం గ్రామంలో దళితులకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని వర్ధన్నపేట తహసీల్దార్ ఆఫీస్ ఎదుట జాతీయ రహదారిపై అఖిలపక్ష ధర్నా.
Wardhannapet: చెన్నారం దళితులకు వెంటనే ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలి!
Wardhannapet: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామ ప్రజలకు గత ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాలు దళితులకు మంజురు చెయ్యగ అవి ఇప్పటి వరకు పంపిణీ చేయలేదని అవి వెంటనే పట్టలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చెన్నారం గ్రామ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. చెన్నారం గ్రామ ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అఖిలపక్ష పార్టీల నాయకులు, గ్రామస్తులు కలిసి వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారి పై ప్రయాణిస్తున్నావ్ వాహనాలు నిలిపివేయడంతో తీవ్ర ట్రాఫిక్ నెలకొంది దీంతో పోలీసులు నిరసనకారులకు సర్దు చెప్పడంతో ధర్నాలు విరమించారు. తమ గ్రామంలో ఉన్న అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు పట్టాలు అందజేయడం లేదని ఆందోళనకారులు ఆరోపించారు.
ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నామని, అయినప్పటికీ తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.




