Jangaon: స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉత్కంఠ - కారులో చిక్కుకున్న బాలుడు సేఫ్!
Jangaon: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో కారులో ఆటోమేటిక్ లాక్ పడి చిన్నారి ఇబ్బంది. యూట్యూబ్ సాయంతో అద్దం కిందకు దించి కాపాడిన వైనం.
Jangaon: స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉత్కంఠ - కారులో చిక్కుకున్న బాలుడు సేఫ్!
Jangaon: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ కేంద్రంలోని శివునిపల్లిలో మణికంఠ హోటల్ వద్ద ఓ వ్యక్తి తన కుమారుడిని కారులో ఉంచి టిఫిన్ తెచ్చేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో సెంట్రల్ లాక్ పడటంతో తలుపులు తెరుచుకోలేదు.
20 నిమిషాలపాటు తండ్రి, స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు ఓ వ్యక్తి యూట్యూబ్ సాయంతో బాలుడికి వివరించడంతో కారు అద్దాన్ని కిందకు దించాడు. చిన్నారులను కారులో ఒంటరిగా వదలొద్దని పలువురు సూచిస్తున్నారు.




