Gudur: సీతానగరం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!
Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేటి బాలలే రేపటి తరాల వారధులని హెచ్ఎం పులి దేవేందర్ అన్నారు.
Gudur: సీతానగరం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!
గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటలు, పాటలు వంటి వినోద కార్యక్రమాలు నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం బాలల దినోత్సవం యొక్క ప్రత్యేకతను, బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యతను ప్రధానోపాధ్యాయులు పులి దేవేందర్ ముదిరాజ్ వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి సమాజానికి మార్గదర్శకులు, దేశ భవిష్యత్తుకు వారధులు అని అన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నారని అడిగినప్పుడు పోలీస్, టీచర్, పైలట్, ఆర్మీ వంటి ఉన్నత లక్ష్యాలను వెల్లడించడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ప్రతి విద్యార్థి చిన్నప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని, క్రమశిక్షణతో చదువుతూ దానిని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సహోపాధ్యాయురాలు చర్ప దేవి, ఆయా వీరమ్మ పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.




