Chilpur: సహస్ర దీపాల కాంతుల్లో వెంకన్న.. చిల్పూర్ ఆలయంలో కార్తీక వేడుకలు!

Chilpur: చిల్పూర్‌లోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కార్తీక పౌర్ణమి వేడుకలు, సహస్ర దీపాలంకరణ అంగరంగ వైభవంగా జరిగాయి.

V Ravikiran, Jangaon
Published on: 24 Nov 2026 10:58 PM IST
Chilpur
X

Chilpur: సహస్ర దీపాల కాంతుల్లో వెంకన్న.. చిల్పూర్ ఆలయంలో కార్తీక వేడుకలు!

చిల్పూర్: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారిని సహస్ర దీపాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేయి దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక హారతులతో భక్తి వాతావరణం నెలకొంది.

V Ravikiran, Jangaon

V Ravikiran, Jangaon