Chintal: చింతల్‌లో ఘనంగా వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం

Chintal: చింతల్ 36వ డివిజన్‌లో నరిశెట్టి సతీష్, స్వప్న దంపతులు నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ ఆడెపు వెంకటేష్ ప్రారంభించారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 16 Nov 2026 5:17 PM IST
Chintal
X

Chintal: చింతల్‌లో ఘనంగా వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం

చింతల్‌: 36వ డివిజన్ చింతల్‌లో నరిశెట్టి సతీష్ మరియు స్వప్న నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆడెపు వెంకటేష్ బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించడం జరిగింది , నూతన వ్యాపారాన్ని ప్రారంభించిన యజమానులు సతీష్ మరియు స్వప్నకి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు స్వచ్ఛమైన, నాణ్యమైన త్రాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ వాటర్ ప్లాంట్ మంచి ఆదరణ పొందుతూ, అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.

వారి కృషి మరింత మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ, వ్యాపార రంగంలో మంచి గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, వ్యాపారులు పాల్గొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST