Sultanabad: సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
Sultanabad: సుల్తానాబాద్ ఊర చెరువును రూ. 12 కోట్ల నిధులతో మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేసే పనులకు ప్రభుత్వ విప్ విజయరమణ రావు శంకుస్థాపన చేశారు.
Sultanabad: సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
Sultanabad: సుల్తానాబాద్ పట్టణంలోని ఊర చెరువును మినీ ట్యాంక్ బండ్ గా నిర్మించేందుకు రూ.12 కోట్ల నిధులతో చేపట్టే పనులకు చెరువు వద్ద మంగళవారం రోజున సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు,నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపన చేసిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ.చింతకుంట విజయరమణ రావు గారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ..
చాలా కాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న చెరువు అభివృద్ధి వల్ల సుల్తానాబాద్ తో పాటు పలు గ్రామాల పంట పొలాలకు ఆయకట్టు స్థిరీకరణ పెరుగుతుందన్నారు. అలాగే కట్ట అభివృద్ధితో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకుగాను టూరిజం శాఖతో రూ. మరో 2 కోట్ల నిధులను మంజూరీ చేయిస్తానన్నారు. ఇప్పటికే పట్టణంలో ప్రధాన రోడ్లను వెడల్పు చేసి సిసి రోడ్లుగా అభివృద్ధి చేయడం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు.
పూసాల రోడ్డు సెంట్రల్ లైటింగ్ వలె అంబేద్కర్ చౌరస్తా నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు వెడల్పు చేసి ఆధునికరించి ఏర్పాటు చేసిన సెంట్రింగ్ లైటింగ్ ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు చెప్పారు. ప్రధాన రోడ్ల నుండి మార్కండేయ కాలనీ, శ్రీరాములపల్లి గ్రామాలకు రోడ్లు నిర్మించినట్లు చెప్పారు. అమృత్ 2 స్కీం కింద రక్షిత మంచినీటి సదుపాయాన్ని విస్తరించి సమస్య లేకుండా చేస్తామన్నారు.
ఇందుకు సంబంధించిన పనులు ప్రగతి దశలో ఉన్నాయని తెలిపారు. అలాగే సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఆఫీసుకు, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు కొత్త భవనాలు నిర్మిస్తామని చెప్పారు. తాను పుట్టింది శివ పల్లి గ్రామంలో అయినప్పటికీ పెరిగింది మాత్రం సుల్తానాబాద్ లో అన్నారు. అందుకే పట్టణ పై తనకు మమకారం ఉందన్నారు.
సమస్యలు ఏమైనా ఉంటే ప్రజలు తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే గారు తెలిపారు. ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో ఇలాంటి అభివృద్ధి, సంక్షేమం జరగన్నప్పటికీ మౌనంగా ఉన్నారని, తమ హయాంలో కూడా ఇలా మౌనంగా ఉండకూడదు అన్నారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా కార్యరూపంలోకి తీసుకు వస్తున్నానని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి హామీలు తీర్చి ఓట్లు అడుగుతానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత, స్థానిక కౌన్సిలర్ గాదాసు మంజుల తో పాటు పట్టణ కౌన్సిలర్లు, తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ శాఖ ఎస్ ఈ, డిఈఈ, ఏఈ, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.




