Warangal: సికేఎం కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీ దరఖాస్తుల ఆహ్వానం!

Warangal: సికేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. చివరి తేదీ, అర్హతల పూర్తి వివరాలు ఇవే.

MD. AMEER, WARANGAL EAST
Published on: 21 Aug 2026 12:20 PM IST
Warangal
X

Warangal: సికేఎం కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీ దరఖాస్తుల ఆహ్వానం!

Warangal: సికేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2026 - 27 విద్యా సంవత్సరంలో అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. పోశయ్య ఒక ప్రకటనలో తెలిపారు బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్(1), బీకాం హెచ్ ఆర్ ఆపరేషన్స్ (1) లలో ఖాళీగా ఉన్న పోస్టులకు గాను ఓసి, బిసి అభ్యర్థులు అయితే ఎం కామ్ పూర్తి చేసి 55% మార్కులతో, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 50% మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు.

ఎంపికలో పి హెచ్ డి, నెట్, సెట్ అర్హత, బోధన అనుభవం కలిగిన వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 24వ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోగా నేరుగా కాలేజీలో అందజేయాలని తెలిపారు దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన వారికి సమాచారం అందించి ఎంపిక ప్రక్రియ చేపడతామని అన్నారు పూర్తి వివరాల కోసం సి కె ఎం కళాశాలను సంప్రదించగలరు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story