Palakurthi: పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి భరోసా: యశస్విని రెడ్డి

Palakurthi: పాలకుర్తి మండలంలోని 43 మంది అనారోగ్య బాధితులకు రూ.24.55 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అందజేశారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 12 Nov 2026 4:48 PM IST
Palakurthi
X

Palakurthi: పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి భరోసా: యశస్విని రెడ్డి

పాలకుర్తి: పాలకుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి గారు అందజేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 43 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.24,55,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే గారు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలు ఏ కుటుంబానికైనా అనుకోని ఆర్థిక భారాన్ని మిగులుస్తాయని, ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్య ఖర్చులను భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. అలాంటి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూత అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్కరూ మెరుగైన వైద్య చికిత్సకు దూరం కాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అవసరమైన వారికి అండగా నిలుస్తోందని అన్నారు.

పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు భరోసా ఇచ్చారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు కావడంతో లబ్ధిదారులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI