Mulugu: ములుగు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్ రెడ్డి!
Mulugu: మేడారం ఆలయాన్ని అంతర్జాతీయ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని, యువత నైపుణ్యాలు పెంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Mulugu: ములుగు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్ రెడ్డి!
ములుగు: సమ్మక్క–సారలమ్మ ఆశీర్వాదంతో ములుగు నుంచే పాదయాత్ర ప్రారంభించాం సీఎం రేవంత్ రెడ్డి, ప్రజల సమస్యలు తెలుసుకుని, వారికి భరోసా కల్పించేందుకే పాదయాత్ర చేపట్టాం సీఎం నాలుగు కోట్ల ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేశాం.
అడవుల్లో ప్రజల సమస్యలపై పోరాడిన సీతక్క.. నేడు మంత్రిగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు సీఎం, సమ్మక్క–సారలమ్మ దేవాలయాన్ని ప్రపంచాన్ని ఆకర్షించేలా అభివృద్ధి చేస్తాం రామప్ప దేవాలయంతో పోటీపడేలా సమ్మక్క–సారలమ్మ దేవాలయ అభివృద్ధికి కృషి సీఎం, ములుగు ఎస్పీ కార్యాలయ నిర్మాణాన్ని త్వరలో చేపడతాం – సీఎం రేవంత్ రెడ్డి. మల్లూరు స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం.
జంపన్నవాగులో భక్తులకు స్నానాలు, ఇతర సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి చేస్తాం, ములుగు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధులపై ప్రత్యేక సమీక్ష చేపట్టాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డిని ఆదేశిస్తా, సమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు, ములుగు యువతకు సాంకేతిక నైపుణ్యాలు, భాషా పరిజ్ఞానం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
ఇంగ్లీష్, జర్మన్ వంటి భాషలు నేర్చుకుని ప్రపంచంతో పోటీపడాలని యువతకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, గిరిజన యూనివర్సిటీని ములుగు ప్రాంత యువత సద్వినియోగం చేసుకోవాలి, విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలు ఉంటేనే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పొందగలరు, ములుగు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి.




