Hanamkonda: భూ సేకరణ సర్వేను పరిశీలించిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయి!
Hanamkonda: రైల్వే సబ్ స్టేషన్ ఆర్వోబి ఆర్యుబి మరియు స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు కోసం చేపట్టిన భూ సేకరణ సర్వే పనులను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పరిశీలించారు.
Hanamkonda: భూ సేకరణ సర్వేను పరిశీలించిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయి!
Hanamkonda: హాసన్ పర్తి మండలం కోమిటిపల్లి లో రైల్వే వారికి సబ్ స్టేషన్ ఏర్పాటుకు కావలసిన భూమి కోసం అలాగే జయిగిరి లోని రైల్వే ట్రాక్ దగ్గర నిర్మించ తలపెట్టిన ఆర్వోబి (ROB), ఆర్యుబి ( RUB) కి కావాలిసిన భూమి కోసం జరుగుతున్న సర్వే పనులను సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పరిశీలించారు
అనంతరం భీమారం శివారు లోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం వద్ద నిర్మించ తలపెట్టిన స్పోర్ట్స్ స్కూల్ కోసం స్థలాన్ని కూడా కలెక్టర్ పరిశీలించి రెవిన్యూ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఆ తరవాత కలెక్టరెట్ లోని మినీ కాన్ఫెరెన్స్ హల్ లో కుడా, రెవిన్యూ, రైల్వే అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యి రైల్వే శాఖ కి సంబందించిన భూ సేకరణ అంశాల మీద చర్చించి తగు సూచనలను తెలిపారు
ఈ సమావేశం లో ఆర్డివో వెంకటేశ్వర్లు, కుడా పి ఓ అజిత్ రెడ్డి, IRSE సైలేష్, DYSO ప్రశాంత్, జిల్లా మత్స్య శాఖ అధికారి పిల్లి శ్రీపతి, ఆర్ అండ్ బి ఈ ఈ చరణ్, NPDCL SE సామ్య నాయక్, ,రైల్వే అసిస్టెంట్ ఎక్సక్యూటివ్ ఇంజనీర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు




