Hanamkonda: "రెసిడెన్షియల్ కాలేజీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!

Hanamkonda: పర్యటన నేపథ్యంలో పెద్దమ్మగడ్డ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయ్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు

Narender, Staff Reporter  -Warangal
Published on: 8 July 2026 5:22 PM IST
Hanamkonda
X

Hanamkonda: "రెసిడెన్షియల్ కాలేజీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!

హనుమకొండ, జూలై 8: రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ఈ నెల 9వ తేదీన (గురువారం) జిల్లా పర్యటన సందర్భంగా హనుమకొండలోని పెద్దమ్మగడ్డలో ఉన్న తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల కాలేజి ఆఫ్ ఏక్సిలెన్స్ సందర్శించనున్న

నేపథ్యంలో కాలేజి ఆఫ్ ఏక్సిలెన్స్ చేపదుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి, జాయింట్ కలెక్టర్ కె. రవితో కలిసి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కళాశాలలోని మౌలిక వసతులు, కిచెన్ షెడ్, ప్లే గ్రౌండ్, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌లను పరిశీలించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులను సందర్శించి డిజిటల్ విద్యా విధానంలో ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు.

అదేవిధంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మమేకమై వారితో ఆత్మీయంగా మాట్లాడారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల పఠన సామర్థ్యం, అభ్యాస నైపుణ్యాలను స్వయంగా పరిశీలించి, పలు ప్రశ్నలు అడిగి వారి అవగాహనను తెలుసుకున్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా కళాశాలలోని కిచెన్ మరియు స్టోర్‌రూమ్ను పరిశీలించి, విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యమైన, తాజా కూరగాయలు, ఆహార పదార్థాలను మాత్రమే వినియోగించాలని అధికారులకు సూచించారు.

వంటశాల, నిల్వ గదుల్లో పరిశుభ్రత (హైజీన్) ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ఆహార పదార్థాల నిల్వ, వంట ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు పోషకాహారం, సురక్షితమైన ఆహారం అందేలా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

గవర్నర్ పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సత్వరమే పూర్తి చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ నందనూరి పద్మినితో పాటు సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగసాగర్, ఆర్డీవో వెంకటేష్, ట్రైనీ కలెక్టర్ రోహిత్, జీడబ్ల్యూఎంసీ అధికారులు సీఎంహెచ్ ఓ రాజారెడ్డి, ఎం హెచ్ ఓ రాజేష్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్, కళాశాల ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story