Hanamkonda: యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్!
Hanamkonda: హనుమకొండ జిల్లా పరకాలలో రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి పరిశీలించారు.
Hanamkonda: యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్!
హనుమకొండ: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా పరకాల రాజుపేట సమీపంలో రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఇప్పటివరకు చేపట్టిన పనులు నాణ్యతగా ఉండడం పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను నాణ్యతతో కొనసాగించాలన్నారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పనుల పురోగతి గురించి టీజీఈడబ్ల్యూఐడిసి ఈఈ అరుణ్ కుమార్ జిల్లా కలెక్టర్ కు వివరించారు.
ఈ సందర్భంగా పరకాల మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పవన్, పరకాల ఆర్డిఓ డీఎస్ వెంకన్న, నాయబ్ తహసిల్దార్ ఆరేపల్లి సుమన్, ప్రాజెక్టు మేనేజర్ జుబేర్ ఖాన్, కౌన్సిలర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
పరకాల లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను హనుమకొండ జిల్లా కలెక్టర్ మంగళవారం సందర్శించారు. కళాశాలలోని బీకాం సీఏ, బిఎ, బిఎస్సి డెయిరీ సైన్స్ తరగతులను, కంప్యూటర్ ల్యాబ్ ను కలెక్టర్ పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. మీ జీవిత లక్ష్యం ఏంటి అని విద్యార్థులను అడిగారు. ఆయా తరగతుల విద్యార్థులతో మాట్లాడుతూ ఎక్కడెక్కడ నుంచి కళాశాలకు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదువుతూ ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. కంప్యూటర్ ల్యాబ్ లోని విద్యార్థులు సద్వినియోగం చేసుకునే విధంగా సౌకర్యాన్ని మెరుగుపరచాలన్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంతోష్ కుమార్, టీజీఈడబ్ల్యూఐడిసి ఈఈ అరుణ్ కుమార్, పరకాల ఆర్డిఓ డిఎస్ వెంకన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.




