Hanamkonda: పప్పు దినుసుల సాగును ప్రోత్సహించాలి: కలెక్టర్ చాహత్!
Hanamkonda: పప్పు దినుసుల సాగును పెంచి స్వయం సమృద్ధి సాధించేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
Hanamkonda: పప్పు దినుసుల సాగును ప్రోత్సహించాలి: కలెక్టర్ చాహత్!
హనుమకొండ: ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలలో భాగంగా పప్పు దినుసుల పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.
మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ని కాన్ఫరెన్స్ హాలులో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్ ( పప్పు దినుసుల సాగులో స్వయం సమృద్ధి సాధించడం)పై వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లాలోని ఆయా మండలాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు గురించిన వివరాలను మండల వ్యవసాయ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రైతు బీమా క్లెయిమ్ ల వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ ఎరువుల దుకాణాలలో ఎరువులు విత్తనాల నాణ్యత ప్రమాణాలను పాటించే విధంగా విస్తృత తనిఖీలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతు బీమా క్లెయిమ్ లను త్వరితగతిన చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రైతు నమోదు( ఫార్మర్ రిజిస్ట్రీ) అందరూ రైతులు నమోదు చేసుకునే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 87.8 శాతం నమోదు పూర్తయిందని, మిగతా నమోదును త్వరగా పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, సహాయ సంచాలకులు ఆదిరెడ్డి, అవినాష్ వర్మ, సాంకేతిక వ్యవసాయ అధికారి కమలాకర్, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.




