Hanamkonda: సహజ ప్రసవంపై అవగాహన వాక్.. 700 మంది విద్యార్థుల భాగస్వామ్యం!
Hanamkonda: హనుమకొండలో సహజ ప్రసవాలపై అవగాహన వాక్‌ను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, సీపీ ఎన్. శ్వేత ప్రారంభించారు.
Hanamkonda: సహజ ప్రసవంపై అవగాహన వాక్.. 700 మంది విద్యార్థుల భాగస్వామ్యం!
Hanamkonda: సొసైటీ ఆఫ్ మిడ్‌వైవ్స్, ఇండియా (SOMI), ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, హన్మకొండ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండలో సహజ ప్రసవం కోసం దేశవ్యాప్త నడక (Nationwide Walk for Natural Birthing) నిర్వహించారు.
ఈ నడకను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఎన్. శ్వేత , పోలీస్ కమిషనర్, జెండా ఊపి ప్రారంభించారు.
700 మంది నర్సింగ్ విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని సహజ ప్రసవం, సురక్షిత మాతృత్వం, మిడ్‌వైవ్స్ పాత్ర గురించి నినాదాలు చేస్తూ, ప్లకార్డులతో నడక సాగించారు. ఈ సందర్భంగా సీపీ, కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని అభినందించారు.
సహజ / సాధారణ ప్రసవాన్ని ప్రోత్సహించడం, అనవసర సిజేరియన్ ఆపరేషన్లను తగ్గించడం, ప్రతి తల్లికి మిడ్‌వైఫరీ నేతృత్వంలోని సంరక్షణను బలోపేతం చేయడం ఎంతో ముఖ్యమని తెలిపారు.
ఇలాంటి అవగాహన కార్యక్రమాలు గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలలో సురక్షితమైన, గౌరవప్రదమైన సహజ ప్రసవం పట్ల విశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. నడక సందర్భంగా విద్యార్థులు సాధారణ ప్రజలకు సహజ ప్రసవం గురించి అవగాహన కల్పించే కరపత్రాలను (Pamphlets) పంపిణీ చేశారు.
సహజ ప్రసవం వల్ల కలిగే ప్రయోజనాలు, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సురక్షిత మాతృత్వం గురించి ప్రజలకు వివరించారు. KMC ఆర్చ్ నుండి ప్రారంభమై GMH హాస్పిటల్, హన్మకొండ వరకు జరిగిన ఈ వాక్ లో సహజ ప్రసవాన్ని ప్రోత్సహించడం, ప్రతి తల్లికి కరుణతో కూడిన మిడ్‌వైఫరీ సంరక్షణ అందించడం, అందరికీ సురక్షిత మాతృత్వం కోసం కృషి చేయడం అనే ప్రతిజ్ఞతో ఈ కార్యక్రమం ముగిసింది.
ఈ కార్యక్రమంలోవాక్ కో-ఆర్డినేటర్ బి. సువత్సల, ప్రిన్సిపాల్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, హన్మకొండ. డా. ఎ. అప్పయ్య, DM & HO, బి. సువత్సల, ప్రిన్సిపాల్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, అధ్యాపకులు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, హన్మకొండ,మేధా నర్సింగ్ కళాశాల, బాలాజీ నర్సింగ్ కళాశాల, ప్రశాంతి నర్సింగ్ కళాశాల, జయ నర్సింగ్ కళాశాల,
ప్రభుత్వ స్కూల్ ఆఫ్ నర్సింగ్,వాగ్దేవి డిగ్రీ కళాశాల, కాకతీయ డిగ్రీ కళాశాల,ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, హన్మకొండ ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.




