Warangal: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ప్రజావాణిపై కలెక్టర్!
Warangal: జిల్లా కలెక్టరేట్‌తో పాటు రెవెన్యూ డివిజన్ల పరిధిలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు
Warangal: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ప్రజావాణిపై కలెక్టర్!
వరంగల్, జూలై 06: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందని తెలిపారు.
జిల్లా స్థాయి సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి, జిల్లా స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి లో నిర్వహించే ప్రజావాణి లో డివిజన్ స్థాయి అధికారులు హాజరై ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ల సూచించారు.
జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రకటన ద్వారా పేర్కొన్నారు.




