Warangal: వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి: కలెక్టర్ సత్య శారద!

Warangal: వరంగల్ కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండలాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 4 Oct 2026 10:58 PM IST
Warangal
X

Warangal: వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి: కలెక్టర్ సత్య శారద!

వరంగల్: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10.00 గంటల నుండి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలో జిల్లా స్థాయి అధికారులు రెవెన్యూ డివిజన్ పరిధిలో రెవెన్యూ డివిజన్ అధికారులు మండల స్థాయిలో మండల స్థాయి అధికారులు ప్రజావాణి నిర్వహిస్తారని.

ఈ ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.