Warangal: వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా నీట్ పీజీ-2026 ప్రవేశ పరీక్ష!
Warangal: వరంగల్ జిల్లా నర్సంపేట బిట్స్ కళాశాలలో నీట్ పీజీ–2026 పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీ చేశారు. పరీక్ష ప్రశాంతంగా పూర్తయిందని తెలిపారు.
Warangal: వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా నీట్ పీజీ-2026 ప్రవేశ పరీక్ష!
వరంగల్ జిల్లా, ఆగస్టు 30: నర్సంపేటలోని బిట్స్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ–2026 పరీక్షను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీ చేశారు. ఈ తనిఖి లో జిల్లా కలెక్టర్ వెంట డియార్వో విజయలక్ష్మి , నర్సంపేట ఆర్డీవో ఉమారాణి సెక్షన్ సూపర్డెంట్ రంజిత్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, పరీక్ష నిర్వహణ తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ రోజు నిర్వహించిన నీట్ పీజీ–2026 పరీక్షకు మొత్తం 132 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 127 మంది హాజరయ్యారని జిల్లా కలెక్టర్ తెలిపారు. పరీక్ష ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా విజయవంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
Next Story




