Warangal: ఎంజీఎం ఆసుపత్రి వైద్య విభాగాలను తనిఖీ చేసిన కలెక్టర్ సత్య శారద!

Warangal: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని వివిధ వైద్య విభాగాలను గురువారం జిల్లా కలెక్టర్ డా. సత్య శారద తనిఖీ చేసి వైద్య సేవలు, పరిశుభ్రత, భద్రతపై ఆదేశాలిచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 Nov 2026 6:23 PM IST
Warangal
X

Warangal: ఎంజీఎం ఆసుపత్రి వైద్య విభాగాలను తనిఖీ చేసిన కలెక్టర్ సత్య శారద!

వరంగల్: వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద గురువారం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించి, వివిధ వైద్య విభాగాల్లో అందిస్తున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా నవజాత శిశు సంరక్షణ విభాగం (SNCU), అసంక్రమిత వ్యాధుల చికిత్స వార్డు (NCD), వృద్ధుల సంరక్షణ విభాగం (Elderly Care Unit), పోషకాహార పునరావాస కేంద్రం (NRC), జిల్లా ప్రారంభ జోక్య కేంద్రం (DIEC)లను సందర్శించారు.

ఆయా విభాగాల్లో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, చికిత్సా విధానాలు, నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి, సంబంధిత వైద్యులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు రిజిస్టర్లను సైతం తనిఖీ చేశారు.

ఆసుపత్రిలోని అన్ని వైద్య విభాగాల సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని, పేషెంట్ బెడ్ షీట్లు ఎప్పటికప్పుడు శుభ్రమైన బెడ్ షీట్లు మార్చాలని కలెక్టర్ సూచించారు. ఎంజీఎం లో అందుతున్న వైద్యం గురించి లపేషెట్లను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి ఆరోగ్య సూచికలో బోర్డులలో మెరుగైన ప్రగతి సాధించేలా అధికారులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, ఆసుపత్రి పరిసరాలు, వార్డులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు.

భద్రత సిబ్బంది నిర్లక్ష్యం పై అసహనం వ్యక్తం చేశారు.. భద్రతా సిబ్బంది విధి నిర్వహణలో నిబద్ధత కలిగి ఉండాలని అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. .

ఈ పర్యటనలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజారెడ్డి, ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రామ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్