Jangaon: రాష్ట్రస్థాయి అండర్-14 సెపాక్ తక్రా పోటీలు ప్రారంభం!

Jangaon: జనగామ ధర్మకంచ మినీ స్టేడియంలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14 రాష్ట్రస్థాయి సెపాక్ తక్రా టోర్నమెంట్‌ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 12 Nov 2026 3:11 PM IST
Jangaon
X

Jangaon: రాష్ట్రస్థాయి అండర్-14 సెపాక్ తక్రా పోటీలు ప్రారంభం!

Jangaon: జనగామ జిల్లా క్రీడా రంగంలో మరో ప్రతిష్ఠాత్మక ఘట్టానికి వేదికైంది 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14 బాలబాలికల రాష్ట్రస్థాయి సెపాక్ తక్రా టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్-2026 పోటీలు జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడా పోటీలను ఆరంభించారు. అనంతరం జాతీయ జెండాను ఎగుర వేశారు.

అలాగే వివిధ జిల్లాల పాఠశాలలకు చెందిన విద్యార్థులు నిర్వహించిన మార్చ్‌పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదే విధంగా క్రీడాకారులతో క్రీడా ప్రమాణం చేయించారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON