Bhupalpally: బాలల హక్కుల పరిరక్షణే మనందరి బాధ్యత

Bhupalpally: భూపాలపల్లి ఐడీఓసీలో బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక పిల్లల ప్రజావాణి నిర్వహించి, విద్యార్థుల నుంచి వినతులు స్వీకరించారు కలెక్టర్ రాహుల్ శర్మ.

Bhoomi Reddy, Bhupalpally
Published on: 16 Nov 2026 6:17 PM IST
Bhupalpally
X

Bhupalpally: బాలల హక్కుల పరిరక్షణే మనందరి బాధ్యత

భూపాలపల్లి: పిల్లల హక్కులను పరిరక్షించడం, వారి జీవన విధానానికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. పిల్లల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఐడిఓసి కార్యాలయంలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా పిల్లల ప్రత్యేక ప్రజావాణి నిర్వహించి పిల్లల నుండి వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పిల్లల ప్రజావాణిలో 5 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. పిల్లలు తమ సమస్యలను ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పిల్లల సమస్యలకు పరిష్కారం పొందేలా ప్రజావాణి ప్రాంగణంలో ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణం లోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేశారు.

Bhoomi Reddy, Bhupalpally

Bhoomi Reddy, Bhupalpally