Chityala: చిట్యాల సీహెచ్‌సీలో కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ!
Chityala: చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశం.
Chityala: చిట్యాల సీహెచ్‌సీలో కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ!
Chityala: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన వార్డులు, ప్రసూతి విభాగం, ఐసీయూ, ల్యాబ్‌లను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యం, మందులు, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.
సీజనల్ వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. టీ-హబ్‌కు నమూనాలు పంపించి పరీక్షా ఫలితాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు పరికరాలు, ILRల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.
వార్డుల్లో ర్యాక్‌లు, డిస్పోజల్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని, నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అల్ట్రాసౌండ్ ప్రోబ్ సమస్యను పరిష్కరించి యంత్రాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. పాము, తేలు కాట్లకు అవసరమైన మందులు, ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, మాతా శిశు సంరక్షణ సేవలు, ప్రసవాల సంఖ్య పెరగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ తనిఖీలో ఆసుపత్రుల సమన్వయ అధికారి డా. శ్రీకాంత్, డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ వసంతరావు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.




