Janagon: దివ్యాంగుడి స్వావలంబనకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేయూత

Janagon: ప్రజావాణి వినతిపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మానవీయ కోణంలో తక్షణమే స్పందించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 15 Jun 2026 3:44 PM IST
Janagon
X

Janagon: దివ్యాంగుడి స్వావలంబనకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేయూత

జనగామ: ప్రజావాణిలో ఫిర్యాదుకు తక్షణ స్పందన దివ్యాంగుడికి బ్యాటరీ ట్రై సైకిల్ మంజూరు. స్వావలంబన దిశగా దివ్యాంగుడికి కలెక్టర్ చేయూత దివ్యాంగుల స్వావలంబన జీవనోపాధి మెరుగుదలకు జిల్లా పరిపాలన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ప్రజావాణి ద్వారా తమ అవసరాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన దివ్యాంగులకు స్పందిస్తూ, బ్యాటరీ ట్రై సైకిళ్లను అందజేయడం ద్వారా వారి జీవన ప్రయాణానికి భరోసా కల్పిస్తోంది.

ఈ సహాయంతో లబ్ధిదారులు స్వతంత్రంగా తమ దైనందిన కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరుచుకునే అవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని పాలకుర్తి మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు నారగోని యాకయ్య, తమ జీవనోపాధి కోసం బ్యాటరీ ట్రై సైకిల్ అవసరమని ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు దరఖాస్తు సమర్పించారు.

తమ దైనందిన అవసరాలు తీర్చుకోవడం స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడం కోసం రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలో వినతిని పరిశీలించిన కలెక్టర్ వెంటనే సంబంధిత అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి (DWO) బెన్షాలోమ్ కు వారి అర్హతలు పరిశీలించి, తగిన చర్యలు తీసుకొని, లబ్ధిదారుడికి బ్యాటరీ ట్రై సైకిల్ మంజూరు చేయాలని సూచించారు.

అనంతరం శాఖాధికారులు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి, యాకయ్యకు బ్యాటరీ ట్రై సైకిల్ ను అందజేశారు. ఈ చర్య ద్వారా వారి రవాణా సమస్యకు తక్షణ పరిష్కారం లభించింది. లబ్ధిదారుడి సంతోషం బ్యాటరీ ట్రై సైకిల్ అందుకున్న నారగోని యాకయ్య తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చాలా కాలంగా రవాణా సౌకర్యం లేక నిత్యావసర పనులు వ్యక్తిగత అవసరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సి వచ్చేదని చెప్పారు.

ప్రజావాణిలో చేసిన వినతికి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, బ్యాటరీ ట్రై సైకిల్ అందజేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తమలాంటి దివ్యాంగుల అవసరాలను గుర్తించి, అండగా నిలిచిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోం గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సహాయం తమ జీవితంలో కొత్త ఆశలు నింపిందని యాకయ్య ఆనందం వ్యక్తం చేశారు.

ప్రజావాణిలో వచ్చిన వినతులను మానవీయ దృక్పథంతో పరిశీలిస్తూ అర్హులైన వారికి సత్వర సహాయం అందించడంలో జిల్లా పరిపాలన ముందుంటోంది. ఈ చర్యలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరుతున్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తూ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులకు దోహదపడుతున్నాయి.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story