Janagaon: గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!

Janagaon: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్మూర్ మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 20 April 2026 2:28 PM IST
Janagaon
X

Janagaon: గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!

Janagaon: 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి సంక్షేమ వారోత్సవాల నేపథ్యంలో మొదటి రోజున సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల వంట గదులు, పరిసరాలు, పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, ఆహార నాణ్యతపై అవగాహన కింద జిల్లా కేంద్రంలో గల మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.

ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు విధానాన్ని కలెక్టర్ సమగ్రంగా తనిఖీ చేశారు. వంట విధానం, వంట తయారీ ప్రక్రియను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న భోజనం శుభ్రంగా, రుచికరంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.

వంటకు ఉపయోగిస్తున్న పదార్థాల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సరుకులు నాణ్యతతో సరైన ప్రమాణాలతో ఉండాలని ఆదేశించారు. పాఠశాల పరిసరాల్లో పారిశుద్ధ్యం పరిస్థితిని పర్యవేక్షించి, ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని తెలిపారు.

అలాగే తరగతి గదులను సందర్శించి, ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎస్ఏ - 2 (SA-2) పరీక్షల నిర్వహణను పర్యవేక్షించి, పరీక్షలు పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

అదే విధంగా, పాఠశాలలో చేపట్టిన మూత్రశాలల నిర్మాణ పనులను పరిశీలించి, పనులు త్వరగా పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేసి విద్యా ప్రమాణాలను పెంపొందించాలని సూచించారు.

ఈ తనిఖీలో డీసీఓ/ప్రిన్సిపల్ శ్రీనివాస్, సహాయ వార్డెన్ సైదయ్య, హెడ్ సూపర్వైజర్ రాజ్ కుమార్, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story