Jangaon: విద్యార్థుల చేతుల్లోనే మట్టి పరీక్షలు: జనగామ కలెక్టర్!
Jangaon: దేవరుప్పుల మండలం కోల్కొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 'స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్'ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు.
Jangaon: విద్యార్థుల చేతుల్లోనే మట్టి పరీక్షలు: జనగామ కలెక్టర్!
జనగామ జిల్లా: మట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం రసాయనాల వాడకం తగ్గించి, భూసారాన్ని పరిరక్షించాలి – జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. దేవరుప్పుల ZPHS లో కార్యక్రమం కోల్కొండ ZP ఉన్నత పాఠశాలలో వైభవంగా నిర్వహించిన 'స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్'. విద్యార్థుల చేతుల్లో మట్టి పరీక్షలు ప్రత్యేక సాయిల్ హెల్త్ కిట్ల ద్వారా తమ సొంత పొలాల మట్టి నమూనాలను స్వయంగా పరీక్షించనున్న విద్యార్థులు.
రసాయనాలతో పెరిగిన నష్టం విచక్షణారహిత రసాయనాల వినియోగంతో మట్టి విషతుల్యమై, పంట దిగుబడులు తగ్గుతున్నాయని కలెక్టర్ వెల్లడి. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి మట్టి పరీక్ష ఫలితాలను బట్టి ఎరువులు వాడేలా రైతులకు విద్యార్థులు చైతన్యం తేవాలని పిలుపు. శాస్త్రవేత్తల ప్రత్యక్ష ప్రదర్శన విద్యార్థులకు మట్టి నమూనాల సేకరణ, విశ్లేషణ పద్ధతులను వివరించిన RSTL శాస్త్రవేత్తలు డాక్టర్ అనురాధ, డాక్టర్ వికాస్.




