Jangaon: జనగామ జిల్లాలో 33,651 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు!
Jangaon: జనగామ జిల్లాను పోలియో రహితంగా మార్చేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.
Jangaon: జనగామ జిల్లాలో 33,651 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు!
జనగామ: జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం National Immunization Day NID 2026 నిర్వహణపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 0–5 సంవత్సరాల వయసు గల 33,651 మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయుట లక్ష్యంగా నిర్ణయించామన్నారు. అదనంగా 277 మంది వలస పిల్లలను కూడా గుర్తించి టీకా కార్యక్రమంలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు.
ఈ కార్యక్రమం కోసం జిల్లాలో 293 పోలియో బూత్‌లు, 29 రూట్లు, 29 రూట్ సూపర్వైజర్లు 16 మొబైల్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే 94 అధిక ప్రమాద ప్రాంతాలను High Risk Areas గుర్తించి, ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.
కార్యక్రమం నిర్వహణకు 1,172 మంది టీకా సిబ్బంది నియమించామని, ప్రతి బూత్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. అదనంగా 15 ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేసి, ప్రయాణికుల పిల్లలకు కూడా పోలియో చుక్కలు అందించనున్నారన్నారు.
జిల్లాకు అవసరమైన 2,103 వైల్స్, 33,651 BOPV డోసులు అందుబాటులో ఉంచి, కోల్డ్ చైన్ నిర్వహణ, వ్యాక్సిన్ రవాణా, సిబ్బంది శిక్షణ, పర్యవేక్షణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గ్రామ స్థాయి, వార్డ్ స్థాయి లో టీం లను ఏర్పాటు చేసి... టామ్ టామ్ వేపించి...పోలియో కార్యక్రమం విజయవంతం గా జరిగేలా చూడాలన్నారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, జిల్లాలో గల అర్హత కలిగిన ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, డీపీఓ వెంకట్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు...




